Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియంను ముట్టడించేందుకు వెళుతున్న యూత్ కాంగ్రెస్ నేత శివసేన రెడ్డిని రామంతపూర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉప్పల్ స్డేడియం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శివసేశారెడ్డి ని అడ్డుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read also: CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
కాగా.. ఈరోజు హైదరాబాద్ – బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆందోళనకు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఉప్పలే స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు తరలి రావడంతో ఉద్రికత్త చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని మండిపడ్డారు.
Read also: Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రెసిడెంట్ పై ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ ఇంకా టిఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాడని ఆరోపించారు. హరీష్ రావు బినామీగా ఉండి బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం జగన్ మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు. జగన్ మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ గా తప్పుకోవాలన్నారు. చేతకాని వాడిలా జగన్ మోహన్ రావు ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లబ్ మెంబర్స్ కి ఇచ్చే టికెట్లను కూడా అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు.
Traffic Restriction: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.50 వరకు