Telangana : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
- సీఎం పై హరీష్ రావు సంచలన ఆరోపణలు
- 20 కుంభకోణాల జాబితా విడుదల
- సిట్టింగ్ జడ్జితో విచారణకు సవాల్
- పారదర్శకతపై సీఎం కు ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ సంచలన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు , ప్రభుత్వంపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే విచారణకు రావాలని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి తమ్ముడు చేసినట్లుగా భావిస్తున్న అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు తాను సిద్ధమని, ఒకవేళ అది వద్దనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు రావాలని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు.
Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాము గుర్తించిన సుమారు 20 రకాల భారీ కుంభకోణాల జాబితాను సిద్ధం చేసి, వాటిపై విచారణ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను ముఖ్యమంత్రికి పంపినట్లు హరీష్ రావు వెల్లడించారు. ఈ జాబితాలో ప్రధానంగా అమృత్ టెండర్ల కుంభకోణం, సివిల్ సప్లైస్ స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, ఫోర్త్ సిటీ , యంగ్ ఇండియా స్కూల్ స్కామ్‌లను ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు సింగరేణి ఓబీ టెండర్లు, నైనీ కోల్ బ్లాక్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్ , ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో మైక్రో బ్రూవరీస్, కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలను కూడా హరీష్ రావు ఎండగట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎంతో పారదర్శకంగా ఉన్నానని గతంలో అసెంబ్లీలో చెప్పిన మాటలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ముఖ్యమంత్రి గారు.. మీరు నిజంగా సత్యహరిశ్చంద్రుడైతే, ఏ తప్పూ చేయకపోతే, మీలో చీము నెత్తురు ఉంటే మీరు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఈ 20 స్కామ్‌లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి” అని ఘాటుగా విమర్శించారు. ఒకవేళ సిఐడి (CID) విచారణపై నమ్మకం లేకపోతే, నేరుగా సిట్టింగ్ జడ్జి సమక్షంలోనే విచారణకు వెళ్దామని, నిజాయితీ ఉంటే భయపడాల్సిన అవసరం లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నామని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!