Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: ఈ రోజు తమిళ స్టార్ హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘ఓం’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది. అభిమానులు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వేళ, చిత్రబృందం విడుదల చేసిన తాజా పోస్టర్లు మరో పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన 2026 అక్టోబర్ 16 రిలీజ్ డేట్ ఈ పోస్టర్లలో కనిపించకపోవడంతో, సినిమా వాయిదా పడే అవకాశాలపై పరిశ్రమలో ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. అయితే ఈ మార్పు వెనుక ప్రధాన కారణంగా రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ పోటీని భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకే తేదీకి రావాల్సి ఉండటంతో, భారీ స్థాయి క్లాష్‌ను నివారించేందుకు నిర్మాతలు ప్రత్యామ్నాయన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాకు ఉన్న భారీ మార్కెట్ దృష్ట్యా, ‘ఓం’కు మరింత అనుకూలమైన విండో కోసం అన్వేషణ జరుగుతోందని సమాచారం.
అయితే ఇది కేవలం రిలీజ్ డేట్ సమస్య మాత్రమే కాదని తాజా కథనాలు సూచిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన థియేటర్ల తర్వాతి స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ వద్ద ఉన్నాయని, ఆ ఒప్పందం మొదట అక్టోబర్ 16 విడుదల తేదీని ఆధారంగా చేసుకుని రూపొందించబడిందని తెలుస్తోంది. అందువల్ల రిలీజ్ డేట్ మారితే, థియేట్రికల్ రన్, ఓటీటీ స్ట్రీమింగ్ మధ్య గ్యాప్‌ను కూడా తిరిగి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. సినీ పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్‌తో పాటు చిత్రబృందంలోని కీలక సభ్యులు ముంబైలో నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది. ఈ చర్చల్లో కొత్త థియేట్రికల్ విడుదల తేదీ, దానికి అనుగుణంగా ఓటీటీ స్ట్రీమింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసే అంశాలు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చర్చలు సానుకూలంగా ముగిస్తే, దీపావళి 2026ను లక్ష్యంగా పెట్టుకుని కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. లేదంటే సినిమా తన అసలు తేదీకే కట్టుబడి ‘జైలర్ 2’తో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది.
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, ఇంద్రన్స్, నసీరుద్దీన్ షా, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం అభిమానుల దృష్టి రెండు అంశాలపై నిలిచింది. ఒకటి ఈరోజు విడుదల కానున్న ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందనేది. రెండోది, ‘ఓం’ నిజంగా అక్టోబర్ 16న వస్తుందా లేక దీపావళి బరిలోకి మారుతుందా అన్నదే. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!