Bhatti Vikramarka : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క డిమాండ్లు
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ లోటును కేంద్రమే భర్తీ చేయాలి
- ఐదేళ్లపాటు నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు భర్తీ చేయాలి
- సిన్ ట్యాక్స్ మొత్తాన్ని రాష్ట్రాలకు అందజేయాలి. -భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు. కనీసం ఐదేళ్లపాటు ఈ నష్టపరిహారం రాష్ట్రాలకు అందాలని డిమాండ్ చేశారు. అలాగే, ‘సిన్ టాక్స్’ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు మళ్లించాలని కోరారు.
Nara Lokesh : “నేను ఎవ్వరిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది”
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్‌లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
జీఎస్టీ తగ్గింపు కారణంగా రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వైద్య, విద్య, సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రాలకు స్వంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి లేదని గుర్తుచేసి, రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను కేంద్ర ప్రభుత్వం రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో రాష్ట్రాల ఆదాయ భద్రతను కాపాడే చర్యలు తప్పనిసరిగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర-రాష్ట్రాలు పరస్పర సహకారంతో పటిష్ట ఆర్థిక యంత్రాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొనసాగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!