Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cucumber Idli: ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడిలో లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏదైనా హెల్తీ స్నాక్ చేయాలన్నా ఇడ్లీ, దోస పిండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పిండి రుబ్బే ఓపిక, అది పులిసే వరకు వేచి చూసే టైం లేనప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక అద్భుతమైన వంటకం ‘ఇన్స్టంట్ దోసకాయ ఇడ్లీ’ (Cucumber Idli). ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్ ఈజీ హెల్తీ ఇడ్లీల తయారీ విధానం, విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
తాజా దోసకాయలు – 2
Also Read
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
పచ్చిమిర్చి – 1
ఇడ్లీ రవ్వ – 1 కప్పు (250 ml)
పెరుగు (గట్టిగా ఉన్నది) – 2 టేబుల్ స్పూన్లు
అల్లం ముక్క (సన్నగా తరిగినది) – చిన్న ముక్క
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఉప్పు – 1 టీస్పూన్ (రుచికి సరిపడా)
నూనె లేదా నెయ్యి – ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
తయారీ విధానం ఇదే..
ముందుగా రెండు దోసకాయల చివరలను కట్ చేసుకోవాలి. దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు, నేరుగా తురుముకుంటే సరిపోతుంది. తురిమిన దోసకాయను ఒక బౌల్లోకి తీసుకోవాలి. దోసకాయలో ఉండే నీటిని పిండాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ముక్కలుగా చేసిన ఒక పచ్చిమిర్చి వేసి నీళ్లు పోయకుండా ఒకటి లేదా రెండు సార్లు పల్స్ చేయాలి. ఇది మెత్తటి పేస్ట్‌లా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. తురిమిన దోసకాయ ఉన్న బౌల్లో ఈ కొబ్బరి-మిర్చి మిశ్రమాన్ని వేయాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఒక టీస్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. దోసకాయలోనే తగినంత తేమ ఉంటుంది కాబట్టి, ఇందులో అస్సలు నీళ్లు పోయకూడదు.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ సమయంలో ఇడ్లీ రవ్వ, దోసకాయలోని తేమను పూర్తిగా పీల్చుకుని సాఫ్ట్‌గా మారుతుంది. 10 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలపాలి. ఒకవేళ మరీ పొడిగా అనిపిస్తేనే ఒకట్రెండు చెంచాల నీళ్లు చిలకరించుకోవాలి, సాధారణంగా నీళ్ల అవసరం పడదు. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ మౌల్డ్స్‌లో పెట్టుకోవాలి. ఈ పిండి సాధారణ ఇడ్లీ పిండిలా జారుడుగా ఉండదు కాబట్టి, చేత్తో లేదా స్పూన్‌తో నీట్‌గా షేప్ చేస్తూ సర్దుకోవాలి. ఈలోగా ఇడ్లీ పాత్రలో నీటిని మరిగించి, నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్లను అందులో ఉంచి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 8 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే. ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే వేడివేడి దోసకాయ ఇడ్లీలు రెడీ.
ముఖ్యమైన చిట్కాలు ..
ఇది ఇన్స్టంట్ రెసిపీ కాబట్టి పిండిని ముందుగానే కలిపి ఫ్రిజ్‌లో పెట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే రుచి, టెక్స్చర్ మారిపోతాయి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే ఫ్రెష్‌గా కలుపుకుని ఇడ్లీలు పెట్టుకోవాలి. ఈ వేడివేడి దోసకాయ ఇడ్లీలను ఫ్రెష్‌గా చేసిన టొమాటో చట్నీ లేదా మీకిష్టమైన మరేదైనా చట్నీతో తింటే కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు లేదా రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు భిన్నంగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ దోసకాయ ఇడ్లీలు బెస్ట్ ఆప్షన్. తక్కువ టైమ్‌లో, ఎలాంటి ఒత్తిడి లేకుండా సులువుగా చేసుకోగలిగే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!