Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- బడంగ్పేట్ డెకరేషన్ గోదాంలో ఘోర ప్రమాదం
- పేలుడులో కార్మికుడు అనూప్ ప్రధాన్ మృతి
- ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ
- కెమికల్స్ నిల్వ, పేలుడు కారణాలపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badangpet Warehouse Blast: హైదరాబాద్ శివార్లలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బడంగ్‌పేట్‌లోని ఒక డెకరేషన్ గోదాంలో అకస్మాత్తుగా కెమికల్ బాక్స్ పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ పేలుడు తీవ్రత ఎంత బలంగా ఉందంటే, సదరు కార్మికుడి శరీర భాగాలు ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
అక్కడికక్కడే మృతి చెందిన అనూప్ ప్రధాన్
ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడిని యూపీ (ఉత్తరప్రదేశ్) కి చెందిన అనూప్ ప్రధాన్ (35) గా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం ఇటీవలనే కోల్‌కతా నుండి ఇక్కడికి వచ్చిన అనూప్, బడంగ్‌పేట్‌లోని డెకరేషన్ గోదాంలో పనిలో చేరాడు. శనివారం గోదాంలో పని చేసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న ఒక కెమికల్ బాక్స్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనూప్ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
రంగంలోకి క్లూస్ టీమ్.. పోలీసుల విచారణ
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. పేలుడుకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. అసలు ఆ గోదాంలో ఎలాంటి రసాయనాలు నిల్వ చేశారు? నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ ఉంచారా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?