ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Central Government: దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183.42 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఐదో ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన నిధులలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1132.25 కోట్లు, కేరళకు రూ.1097.83 కోట్లు, ఏపీకి రూ.879.08 కోట్లు విడుదలయ్యాయి. రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆర్ధిక…
దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల…