Yoga Mahotsav: ఇక్కడి కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, ముంజ్ పరా మహేంద్ర బాయ్, గవర్నర్ తమిళ్ సై, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్టమస్ లాగానే యోగా దినోత్సవం పండుగ లాగా చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి ఇల్లాళ్ళు అందరూ యోగా చేయాలన్నారు. ఈ యోగా టెన్షన్ లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోడీ కి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్రమోదీ కి వినిపించాలని కోరారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు.
Read also: Astrology : మే 27, శనివారం దినఫలాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కు ముందు కౌంట్ డౌన్ గా ఈ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. యావత్ ప్రపంచంలోనే ఏకైక కార్యక్రమం ఈ యోగా మహోత్సవ్ అని అన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జూన్ 21 న ప్రతి ఒక్కరు ఇండ్లలో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలన్నారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజుల కౌంట్ డౌన్ తో యోగ మహోత్సవ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం సిద్ధం చేయడం కోసం యోగా మహోత్సవ్ అన్నారు. యోగ మహోత్సవ్ కార్యక్రమం ప్రపంచంలో నే మొదటిసారిగా హైదరాబాద్ లో జరుగుతుందన్నారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే 100 రోజులకు ముందే కార్యక్రమం ఏర్పాట్లకు శ్రీకారం అన్నారు. 100 రోజులకు ముందు ఢిల్లీ, 75 రోజులు మందు అస్సాం, 50 రోజులకు ముందు జైపూర్లో, 25 రోజుల ముందు ఇప్పుడు హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు. వచ్చే 25 రోజులు జూన్ 21 యోగా డేకు సిద్ధం చేయడం కోసం పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యోగాతో సంబంధం ఉన్న108 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సారి యోగా థీమ్ వసుదైక కుటుంబమని పేర్కొన్నారు.
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు