Wanaparty Road Accident: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణాలు చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మరువకముందే ..వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర జాతీయ రహదారిపై చెరుకు లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ ను గరుడ బస్సు వెనుక నుంచి ఢీకొన్న బస్సు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్, మరొకరు అక్కడికక్కడే చనిపోయారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొద్ది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు వున్నారు. బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది. బస్సు హైదరాబాద్ మియాపూర్‌కు చెందినది గుర్తించారు. హైదరబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు డైవర్ ఆంజనేయులు, క్లీనర్ సందీప్, శివన్నగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈఘటనతో రహదారి మొత్తం స్థంబించింది. స్థానిక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ ల సహాయంతో బస్సును ట్రాక్టర్ ను పక్కకు తీసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పగలు పొగ మంచుకారణంగా ఈఘటన జరిగిందా లేకా మరే ఇతర కారణాల వల్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
read also:Bhakthi Tv Live: సిరిసంపదలు మీ ఇంట పెరగాలంటే..
నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో..ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి తీవ్ర గాయాలుకాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Astrology: నవంబర్ 21, సోమవారం దినఫలాలు