వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణాలు చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మరువకముందే ..వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.