Nude video call Gadwal: గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. వారి ట్రాప్ లకు మోసపోయిన బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిపై కేసునమోదు చేసి మహేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ కోసం గాలిస్తున్నారు. అయితే నేడు ఈకేసులో ట్వీస్ట్ ఎదురైంది.న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో మరో ఇద్దరి అరెస్ట్ చేశారు గద్వాల్ పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులు పోలీస్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అసలు నేరస్తులను తప్పించి తమ పిల్లల్ని ఇరికించారని ఆరోపిస్తున్నారు. సిట్ తో దర్యాప్తు జరిపించాలంటున్న ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్వీస్ట్ ఏంటంటే.. టౌన్ ఎస్ ఐ హరిప్రసాద్ రెడ్డి పై పోలీస్ ఉన్నతాధికారుల విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఎందుకంటే 15 రోజుల క్రితం న్యూడ్ కాల్ నిందితుల నుంచి టౌన్ ఎస్ ఐ హరిప్రసాద్ రెడ్డి లక్ష రూపాయలు తీసుకొని వదిలేసారనే ఆరోపణలు వస్తున్నాయి.అరెస్టైన వారిలో ఒకరు ఎస్.ఐ. కి సన్నిహితుడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈకేసును సమగ్ర విచారణ జరిపి అసలైన నేరస్థులను శిక్షవిధించాలని కోరుతున్నారు. నేరస్థులను కాకుండా అమాకులపై పోలీసులు జులుం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
Read also: KA Paul: పాల్‌ని జోక్‌గానే తీసుకుంటున్నారా..? ఆయనకు ఏం కావాలి? మనం ఏం నేర్చుకోవాలి..?
నవంబర్ 5న న్యూడ్ వీడియో కాల్ గద్వాల్ జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే.. మహేశ్వర రెడ్డి, నిఖిల్ ప్రేమపేరుతో మహిళలు, విద్యార్థినులను ట్రాప్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేలా చేసి దానిని రికార్డ్ చేస్తున్నారని, తరువాత బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు తాము చెప్పిన వారితో గడపాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆవీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని మహిళలకు బ్లాక్ మైయిల్‌లకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిలో ఒకరిని అదుపులో తీసుకున్నారు. నిఖిల్ కోసం గాలిస్తున్న పోలీసులు మరో ఇద్దరిని అదుపులో తీసుకోవడంపై చర్చకు దారితీస్తోంది. మొదటిలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారన్న వార్త పలు అనుమానాలకు దారితీస్తోంది. మరి అరెస్ట్ చేసిన మరో ఇద్దరిని అదుపులో తీసుకున్న వారు అమాయకులంటూ పోలీస్టేషన్ మెట్లెక్కిన కుటుంబసభ్యులు న్యాయం జరిగేనా? నిజంగా అసలైన నేరస్తులను తప్పించి.. అమాయకులను కేసులో ఇరించే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలకు దారితీస్తోంది. అయితే దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాల్సిందే!
Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‌తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు