Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
- హరీశ్ రావుపై స్పీకర్ అసహనం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యల హెచ్చరిక
- పోలీసులపై దాడులపై సీరియస్
- కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలు , ప్రతిపక్ష పార్టీల వైఖరిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ సభా నిర్వహణ, క్రమశిక్షణ , సభ్యుల ప్రవర్తనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మైక్ ఇస్తే క్షమాపణ చెబుతారనుకున్నా
నిన్న శాసనసభలో జరిగిన అనూహ్య ఘటనలపై ప్రతిపక్ష సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావించినట్లు స్పీకర్ తెలిపారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం మైక్ ఇచ్చే వెసులుబాటు లేకపోయినా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి నాలుగు వైపులా గమనిస్తూ అవకాశం కల్పించానని పేర్కొన్నారు. హరీష్ రావుకు మైక్ ఇస్తే నిన్నటి వ్యవహారంపై సభకు క్షమాపణ చెబుతారని ఆశించానని, కానీ వారు అంశాన్ని పక్కదోవ పట్టించే (డైవర్షన్) ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు సభలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ రావు కనీసం స్పందించకపోవడం సరికాదని, అటువంటి ప్రవర్తన వల్లనే తాను సభలో తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Also Read
- BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది
అసెంబ్లీ వెలుపల జరిగే ఘటనలు స్పీకర్ పరిధిలోకి రావనే వాదనను గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం అంతా స్పీకర్ పరిధి కిందకే వస్తుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఇద్దరు ఎమ్మెల్సీలను తక్షణమే సస్పెండ్ చేసి బయటకు పంపే అధికారం తనకు ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీ విధానం , ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం అలా త్వరితగతిన చర్యలు తీసుకోలేదని వివరించారు. సభను నడిపించడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సభ నిబంధనలనే తాము ప్రస్తుతం అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
పోలీసులపై దాడి, మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై తీవ్ర ఆగ్రహం
ఇటీవల జరిగిన ఘటనల్లో కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు పోలీసులను కొట్టిన దృశ్యాలు బయటకు వచ్చాయని స్పీకర్ ప్రస్తావించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలన్నింటిపై సమగ్ర నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించా
సభ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష ఎల్పీ నేతలకు ఫోన్ చేసి మాట్లాడే సంప్రదాయంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. సభకు హాజరుకావాలని ఆయనను కోరగా, ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదని కేసీఆర్ తెలిపారని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. సభలో సజావుగా చర్చలు జరగాలన్నదే తన తుది లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!