Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pournami Song: తెలుగు సినిమా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ సినిమాలోని ‘భరత వేదముగా’ పాట తాజాగా నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ పాటకు చైనీస్ డ్యాన్సర్ మీరా వాంగ్ టోక్యోలో ఇచ్చిన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘భరత వేదముగా’ పాటకు మీరా వాంగ్ కూచిపూడి డ్యాన్స్ చేసిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు పాటకు తగ్గట్టుగా సంప్రదాయ నృత్య భంగిమలను ప్రదర్శించడంతో ఈ వీడియోపై నెటిజన్లు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, చిత్ర గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు అదే పాటకు ఓ విదేశీ కళాకారిణి తన నృత్యంతో సరికొత్త రూపాన్ని ఇవ్వడంతో మరోసారి వైరల్‌గా మారింది.
మీరా వాంగ్‌కు భారతీయ శాస్త్రీయ నృత్యాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భారత్‌కు రాకుండానే అనంతపురానికి చెందిన అలా వెంకట గోపాల్ వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నట్లు సమాచారం. గతంలో కూడా ఆమె పలు తెలుగు సినిమా పాటలకు తన నృత్య ప్రతిభను ప్రదర్శించింది. ముఖ్యంగా క్లాసిక్ మూవీ ‘మాయాబజార్’లోని ‘ఆహా నా పెళ్లంట’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. భాష తెలియకపోయినా సంగీతం, సాహిత్యం, నృత్యం ద్వారా తెలుగు సినిమా పాటలు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. టోక్యో వేదికగా మీరా వాంగ్ చేసిన ఈ నృత్య ప్రదర్శన కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ‘భరత వేదముగా’ పాట.. ఇప్పుడు ఓ చైనీస్ డ్యాన్సర్ ప్రదర్శనతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించడంపై తెలుగు వాళ్లందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘భరత వేదముగా’ పాట మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. చైనీస్ డ్యాన్సర్ మీరా వాంగ్ టోక్యో లో చేసిన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం,… pic.twitter.com/Uvcv9wpuq9
— Sai Satish (@PROSaiSatish) September 8, 2026
తాజావార్తలు
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!