BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR, Harish Rao Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ తో పాటు కొందరు ఎమ్మెల్యేలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. నిన్న (సోమవారం) అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. దీంతో దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి యత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నాయి. దీంతో అసెంబ్లీ వద్ద నుంచి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. హకీంపేట వద్ద పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాలినడకన బయలుదేరారు. బొల్లారం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎర్రవల్లి వెళ్తున్న తమను ఆపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం చౌరస్తా నుంచి ఎరవెల్లి వైపు నడుచు కుంటూ వెళ్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!