Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
- బాల్కనీ, కిటికీలు, ఏసీ యూనిట్లపై పావురాలు వాలకుండా..
- బాల్కనీలో ఆహారం, ధాన్యాలు, నీరు, తెరిచి ఉన్న చెత్తబుట్టలు ఉంచకపోవడం
- పాత సీడీలు, డీవీడీలు, రిఫ్లెక్టివ్ టేప్, అల్యూమినియం ఫాయిల్ వంటివి వాడడం మంచింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pigeons Problem: మనలో చాలామంది ఇళ్ల బాల్కనీలు, కిటికీలు, ఏసీ యూనిట్లపై పావురాలు వాలడం సర్వసాధారణంగా మారిపోయింది. మొదట్లో ఒకట్రెండు పావురాలు వచ్చి కాసేపు వాలినా.. క్రమంగా అదే ప్రాంతాన్ని అవి నివాసంగా మార్చుకుంటాయి. చివరకు అక్కడే గూడు కట్టుకుని వాటి జీవనం మొదలుపెడతాయి.
దీంతో బాల్కనీలో పావురాల రెట్టలు, ఈకలు, గూడు కోసం తెచ్చిన చిన్నచిన్న పుల్లలు పేరుకుపోతాయి. దీనితో ఇల్లు అపరిశుభ్రంగా మారడంతో పాటు దుర్వాసన, శుభ్రం చేయాల్సిన ఇబ్బంది కూడా పెరుగుతుంది. అయితే పావురాలకు ఎలాంటి హాని చేయకుండా వాటిని బాల్కనీ, ఏసీ ప్రాంతాలకు దూరంగా ఉంచేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా..
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
ఏసీ చుట్టూ బర్డ్ స్పైక్స్..
పావురాలు ఏసీ యూనిట్‌పై కూర్చోవడం అలవాటుగా చేసుకుంటే బర్డ్ స్పైక్స్ ఉపయోగపడతాయి. ఏసీ చుట్టుపక్కల లేదా పావురాలు వాలే వెడల్పాటి ప్రదేశాల్లో వీటిని అమర్చవచ్చు. బాల్కనీ రెయిలింగ్, కిటికీ అంచులపై కూడా వీటిని ఉపయోగించవచ్చు. దీంతో పావురాలు అక్కడ సౌకర్యంగా కూర్చోవడం కష్టమవుతుంది.
బాల్కనీలో ఆహారం, నీరు ఉంచొద్దు..
పావురాలు పదేపదే ఒకే ప్రాంతానికి రావడానికి ప్రధాన కారణాల్లో ఆహారం కూడా ఒకటి. బాల్కనీలో ధాన్యాలు, ఆహార పదార్థాల ముక్కలు లేదా తెరిచి ఉన్న చెత్తబుట్టలు ఉంటే పావురాలు తిరిగి అక్కడికే వస్తుంటాయి. అందుకే తినుబండారాలు, ధాన్యపు గింజలు పడితే వెంటనే శుభ్రం చేయాలి. చెత్తబుట్టను కూడా మూతపెట్టి ఉంచడం మంచిది.
పాత సీడీలు:
ఇంట్లో ఉపయోగించని పాత సీడీలు, డీవీడీలను పడేయకుండా పావురాలను దూరంగా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. పావురాలు ఎక్కువగా వాలే ప్రాంతాల్లో వాటిని వేలాడదీయండి. సూర్యరశ్మి పడినప్పుడు సీడీల నుంచి వచ్చే మెరుపు, అవి కదలడం వల్ల పావురాలు అక్కడ ఎక్కువసేపు ఉండకుండా నిరోధించవచ్చు. మెరిసే రిఫ్లెక్టివ్ టేప్ లేదా అల్యూమినియం ఫాయిల్ పట్టీలు కూడా ఉపయోగించవచ్చు.
బాల్కనీకి బర్డ్ నెట్..
పావురాలు తరచూ బాల్కనీలోకి వస్తుంటే బర్డ్ నెట్ ఏర్పాటు చేయడం సులభమైన మార్గం. బాల్కనీ ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా జాలితో కప్పేస్తే పావురాలు లోపలికి రావడం, గూడు కట్టుకోవడం కష్టమవుతుంది. జాలి అమర్చేటప్పుడు అంచుల్లో చిన్న ఖాళీలు కూడా లేకుండా చూసుకోవాలి.
గూడు కట్టుకునే వస్తువులు:
కాగితాలు, గుడ్డ ముక్కలు, అట్టలు, ఎండిన కొమ్మలు వంటి వస్తువులు బాల్కనీలో పేరుకుపోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏసీ వెనుక, కిటికీ మూలలు, ఇతర చీకటి ప్రదేశాల్లో పావురాలు గూడు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలను తరచూ పరిశీలించి అవసరం లేని వస్తువులను తొలగించాలి.
బాల్కనీని శుభ్రంగా..
పావురాల రెట్టలు, ఈకలు, గూడు సామగ్రి పేరుకుపోకుండా బాల్కనీ, కిటికీ అంచులు, రెయిలింగ్, ఏసీ చుట్టుపక్కల ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పావురాల రెట్టలను పొడిగా ఉన్నప్పుడు ఊడ్చడం కంటే ముందుగా కొద్దిగా తడిపి శుభ్రం చేయడం మంచిది. ఇలా చేస్తే దుమ్ము గాల్లోకి ఎగిరే అవకాశం తగ్గుతుంది.
పావురాలకు దాణా వేయడం..
బాల్కనీ లేదా కిటికీ దగ్గర పావురాలకు దాణా వేయడం వల్ల అవి అదే ప్రాంతానికి పదేపదే రావడం అలవాటు చేసుకుంటాయి. అందుకే ఇంటి చుట్టుపక్కల వాటికి ఆహారం అందించే అలవాటును తగ్గించడం మంచిది. దీంతో పావురాలు ఆ ప్రాంతాన్ని తమ శాశ్వత నివాసంగా మార్చుకునే అవకాశం తగ్గుతుంది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!