Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర..
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాట్ కామెంట్స్..
- రైతు బంధు ఎత్తేసి ఆ డబ్బులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది..
- అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేను అవమానించారు: సండ్ర వెంకట వీరయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandra Venkata Veeraiah: ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపిపిలకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల కింద ఇంటింటికి తిరిగి చెక్కుతో పాటు చీర పంపిణి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పెళ్ళిళ్ళు కాలేదా.. తులం బంగారం అన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. భూమిలేని నిరు పేదల చూట్టే ఈ ప్రభుత్వం తిరుగుతుందని అన్నారు.. భూమి లేని నిరు పేదలకు 15 వేల రూపాయలు ఇస్తామన్నారు.. కౌలు రైతు ఇస్తామన్నారు ఏమైంది.. చివరకు రైతు బంధు ఎత్తెసి ఆ డబ్బులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణామాఫి చేసింది అని సండ్ర వెంకట వీరయ్యా పేర్కొన్నారు.
Read Also: Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతుంది అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యా చెప్పుకొచ్చారు. రుణామాఫీ చుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతున్నారే తప్ప ఇచ్చిన హమీలు గురించి ఏ ఒక్కరు మాట్లాడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఎన్ని ఖాళీలో ప్రకటించలేదు.. క్క రాష్ట్రం ఏపీలో పెన్షన్లు పెంచారు.. ఇక్కడ పెంచలేదు పైగా రెగ్యులర్ గా పెన్షన్ రావటం లేదన్నారు. అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేను అవమానించారు.. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఎప్పుడూ చీకటి ఉండదు, ఎప్పుడూ వెలుగు ఉండదు.. వెలుగుకి ఒక్కసారి చీకటి వస్తేనే ఆ వెలుగుకి ఉన్న విలువ తెలుస్తుంది.. మనకి చీకటి వచ్చింది కాబట్టే వెలుగులో ఎంత మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రజలకు అర్దం అవుతుంది అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా తెలిపారు.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
కాగా, మనకి చీకటి రావటం వలన మంచే జరింగదని అందరు భావించాలని సండ్ర వెంకట వీరయ్యా వెల్లడించారు. ఈ చీకటిలోనే మన విలువ ప్రజలకు తెలుస్తుంది.. పార్లమెంటు ఎన్నికల్లో మన ఓట్లు చెక్కు చెదరాయి.. పోలింగ్ తేడాతో కొన్ని బీజేపీ, కొన్ని ఇండిపెండెంట్ కు పడ్డాయి.. తప్ప సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏం పెరగలేదన్నారు. మన మీద వ్యతిరేకత కూడా పోలింగ్ లో తెలిసింది తప్ప మనం ఓడిపోతాం అని అనుకోలేదు.. ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేశారు.. ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. మన పరిపాలన లో ఏం లోపాలు జరిగాయి.. ఏం తప్పులు జరిగాయని సమీక్షించుకొని భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల విశ్వాసం చొరగానే విధంగా నడుచుకుందాం అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!