Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. వేములవాడ పట్టణంలోని జాతర మైదాన ప్రాంతంలోని ఆలయ వసతి గృహాల్లో అగ్నిప్రమాదం జరిగింది. గదుల్లో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల కారణంగా స్థానికంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read also: TET Hall Tickets: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజే హాల్‌టికెట్లు విడుదల
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేలంపాట ద్వారా టెండర్ దక్కించుకున్న కాంటాక్టర్‌కు చెందిన కొబ్బరి ముక్కలను నిత్యం ఎండబెట్టి విక్రయిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆ కొబ్బరి ముక్కల్లోనుంచి పొగలు రావడం మొదలయ్యాయి. జాతరకు వచ్చిన ప్రజలకు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాలేదు. ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అయితే అక్కడే వున్న కొందరు సిబ్బంది పొగ రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనం పరుగులు తీసారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేములవాడలో జాతర జరుగుతుండగా వేలాది ప్రజలు హాజరయ్యారు. దీంతో ఈ ప్రమాదం సంబవించి నందుకు భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొబ్బరికాయలకు మంట ఎలా వ్యాపించింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. జాతరకు వచ్చిన ప్రజలకు భాయాందోళన గురికావద్దని సూచించారు.
Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి