TET Hall Tickets: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజే హాల్‌టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TET Hall Tickets: తెలంగాణలో ఆగస్టు 1న టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ (టీఎస్ టెట్ 2023) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ టెట్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16తో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023 సెప్టెంబర్ 9న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https: //tstet.cgg.gov.in/ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్ష (టీఎస్ టెట్ 2023) సెప్టెంబర్ 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.టెట్‌కు సంబంధించి గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. గతంలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఈసారి అందులో సగం మాత్రమే రావడం గమనార్హం. అభ్యర్థులంతా గురుకుల పరీక్షపైనే దృష్టి కేంద్రీకరించడంతో టెట్ కు దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది.
Read also: G-20 Summit: జీ-20 సదస్సులో కరీంనగర్ కళాకారుల నైపుణ్యం.. సమ్మిట్‌లో స్టాల్ నిర్వహణకు కూడా అనుమతి
Also Read
డీఎస్సీ (టీఎస్ డీఎస్సీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు కాబట్టి టెట్ స్కోర్‌కే ప్రాధాన్యం ఇస్తారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు ఏడేళ్లు మాత్రమే కాగా, గతేడాది ఎన్‌సీటీఈ జీవితకాలం చెల్లుబాటవుతుందని ప్రకటించింది. ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే జీవితకాలం చెల్లుతుందన్న ధీమాతో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మొత్తం 150 మార్కులకు.. చైల్డ్ డెవలప్ మెంట్ 30 మార్కులు, జనరల్ తెలుగు (3 నుంచి 10వ తరగతి వరకు) 30 మార్కులు, ఇంగ్లిష్ 30 మార్కులకు వ్యాకరణం, వ్యాకరణంపై దృష్టి పెట్టాలి. మిగిలిన 60 మార్కులు చాలా ముఖ్యం..తెలుగు మెథడాలజీ 12 మార్కులు, మిగిలిన 48 మార్కులు తెలుగు సాహిత్యం, ఆధునిక పోకడ, పాఠ్యపుస్తకాల్లో అన్నీ సిద్ధం చేసుకోవాలి.
Salaar: కనీసం సమాధానం చెప్పే తీరిక కూడా లేకుండా పోయింది…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!