Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్క స్వైరవిహారం కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కుక్క కరవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
యాదాద్రి భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. నిన్న అర్ధరాత్రి దాటాక పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చివరి బోగిలో మంటలు అంటుకున్నాయి. అది లగేజీ భోగిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసారు. అయితే.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు రైలు ఆగగానే కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్ నుంచి…
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్…
తెలంగాణలో ఆర్టీసీ బస్ చార్జీలను అడ్డగోలుగాపెంపుదల పై టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతుంటే .. మెండిగా మోడీ ప్రభుత్వమే పెట్రోల్, డీజల్ రేటు తగ్గించిందని అన్నారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం మని మండి పడ్డారు. 60…
చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. దీంతో క్రమంగా మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది…