Fair Accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fair Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలోని కట్టెల గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ఎగిసి పడుతున్న మంటలకు స్థానికులు బయటకు పరుగులు పెట్టారు. అయితే మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎం.ఎం.పహాడీ వద్ద ఓ కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలు.. దట్టంగా నల్లటి పొగ వ్యాపించాయి. సోఫా తయారీ చేసే షాప్ కు మంటలు అంటుకున్నాయి. రెండు గోదాంలు పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. పరిశ్రమలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పరిశ్రమలో ఉన్న మూడు టూవీలర్స్ దగ్ధమయ్యాయి. మంటలను చూసిన స్థానికులు బయటకు పరుగులు తీసారు. పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో గ్యాస్ సిలిండర్లు పట్టుకొని కుటుంబాలు బయటకు వచ్చింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో.. ఊపిరి ఆడక ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chennai Encounter: చెన్నైలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
స్థానికులు కూడా వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేశారు. గత అయిదు గంటలుగా మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కట్టెల గోదాం కావడంతో మంటలు వేగంగా ఎగిసిపడటంతో.. సరవేగంగా మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చలికాలం కావడంతో మంచు కురుస్తోంది. పొగలు వ్యాపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి ద్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటునుంచి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అయితే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
PM Modi : సౌదీ యువరాజుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. యుద్ధం పై తీవ్ర ఆందోళన
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!