తిరుపతి జిల్లాలోని బాలిరేడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. వారంలోగా సాయం అందుతుంది.. విద్యుత్ సరఫరాను కూడా యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని విద్యుత్ సరఫరాను అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని అన్ని రకాలుగా ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంటుంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Manipur : మందుబాబు మేలుకో.. 30ఏళ్ల నిషేధానికి తెర.. తాగేంత తాగేసెయ్
స్వర్ణముఖి కాలువకు పడిన గండిని పరిశీలించాను అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం మీది అని భావించండి.. ఈ ప్రభుత్వంలో అందరికీ మంచే జరుగుతుంది.. బాధితులకు సాయం అందకపోతే.. జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో 1902 కు ఫోన్ చేయండి.. అక్కడ నా కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు అని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోగా పూర్తిస్థాయిలో అందరికీ సాయం అందుతుంది.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తాం.. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం.. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.