Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామంలో చాడ రంగారెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. చాడ రంగారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాడ రంగారెడ్డి గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. అయితే ఎండులు మండుతుండటంతో కుమారులిద్దరిని తీసుకుని లోయర్ మానేరు జలశయానికి తండ్రి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు కొడుకులను తీసుకుని ఈత కోసం నీటిలో దిగాడు. అయితే కాసేపు బాగానే ఇద్దరి పిల్లలతో నీటిలో ఆడుతూ గడిపిన తండ్రికి ఇంతలోనే చిన్నకొడుకు చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు. అక్కడే వున్న తండ్రి రంగారెడ్డి చిన్న కొడుకును కాపాడేందుకు వెళ్లాడు. అయితే కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, కొడుకులు ఇద్దరు నీటిలో మునిగిపోయారు.
Read also: Gangs of Godavari: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్‌కు ముహూర్తం ఖరారు!
అక్కడే వున్న పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి భయంతో ఈత కొడుతూ గడ్డవద్దకు చేరుకున్నాడు. నాన్న, తమ్ముడు అంటూ గట్టిగా కేకలు వేసినా అక్కడ పరిసర ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కాపాడేందుకు ఎవరు రాలేదు. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ఎదుట తండ్రి, తమ్ముడు ప్రాణాలు కోల్పోతున్న కాపాడేలేక నిస్సాహాయ స్థితిలో పెద్ద కుమారుడు కౌసిక్ ఉండిపోయాడు. ఇక చేసేది ఏమీలేక కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లోయర్ మానేరు వద్దకు చేరుకున్నారు. జలాశయంలో ఇద్దరు తండ్రి, కొడుకు విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: రేపు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..