Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ పలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ పలితాలు ప్రకటించారు. మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులు కాగా..ఉత్తీర్ణత 60.01 శాతం. ఇక ద్వితీయ సంవత్సరంలో 3,22,432 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19% గా పేర్కొన్నారు. ఈసారి కూడా ఇంటర్ ఫలితాలల్లో బాలికలే ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉంది. ఇక సాయంత్రం 5 గంటల నుండి మేమో లు అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుండి వచ్చే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ల ద్వారా వేగంగా తెలుసుకోండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల మూల్యాంకనం పూర్తయింది.. ఇప్పుడు ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, అకేషన్ కోర్సు విద్యార్థుల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మరోవైపు తెలంగాణ టెన్త్ ఫలితాలు కూడా అదే నెలలో విడుదల కానున్నాయి. మే 30 లేదా ఏప్రిల్ 1న ప్రకటించే అవకాశం ఉంది.
Hyderabad Metro: రేపు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..