Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటన జరిగి 48 గంటలు దాటినా అతడి జాడ దొరకకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ప్రస్తుతం 12 నుంచి 14 ప్రత్యేక పోలీసు బృందాలు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, మొబైల్ సిగ్నల్ లొకేషన్, రూట్ ట్రాకింగ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. హత్యల అనంతరం రాజ్‌కుమార్ రైల్వే ట్రాక్‌పై నిలబడి, రైలు ఎదురుగా వస్తుండగా చివరి క్షణంలో పక్కకు తప్పుకున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు సమాచారం. దీంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? లేక పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకం ఆడాడా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read
తిమ్మాపూర్ నుంచి నందిగామ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ నుంచి రాజ్‌కుమార్ ఏదైనా రైలు ఎక్కాడా.? ఎక్కి ఉంటే ఏ రైలులో వెళ్లాడు.? అనే అంశంపై దృష్టి సారించారు. నందిగామతో పాటు ఆయా రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాజ్‌కుమార్ పక్కా ప్రణాళికతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని ముందుగానే కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. కత్తిపై తుప్పు ఉండటంతో ఇది ముందే కొనుగోలు చేసిన ఆయుధమని అధికారులు అనుమానిస్తున్నారు.
హత్యలకు ముందు రాజ్‌కుమార్ వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే హత్యల అనంతరం రాత్రి 11:50 గంటలకు అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పటి నుంచి ఒక్క సిమ్ కూడా వినియోగించకపోవడంతో పోలీసులు టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించే అవకాశం ఉందని భావించి అన్ని నంబర్లపై నిఘా ఉంచారు. రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని.. రాష్ట్రం దాటి బెంగళూరు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి శ్రీశైలం వెళ్లే అలవాటు ఉండటంతో అక్కడ కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. బెంగళూరు హైవేతో పాటు హోటళ్లు, లాడ్జీలు, దాబాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. మరోవైపు కేసు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలతో షాబాద్ ఎస్ఐ రమేష్‌ను సస్పెండ్ చేయగా.. సీఐ కాంతారెడ్డికి చార్జ్ మెమో జారీ చేశారు. ప్రస్తుతం షాబాద్ పోలీసులను దర్యాప్తు నుంచి తప్పించి, ఎస్‌వోటీతో పాటు ఇతర ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సీపీ తరుణ్ జోషి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?