Sabita Indra Reddy: పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్‌ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని మంత్రి వివరించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదును పెంచడం కోసం జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 3 నుంచి 10 వరకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎన్‌రోల్‌మెంట్‌డ్రైవ్‌ను చేపడుతామని చెప్పారు. జూన్ 13 నుంచి బడులు పునఃప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా పండుగ వాతావరణంలో బడులను తెరువాలని సూచించారు.
Also Read
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి ప్రభుత్వ బడిపై వారికి భరోసా కల్పించాలన్నారు. బడిబాట సందర్భంగా జూన్ 30 వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం పాఠశాలలకు ఆహ్వానించాలని, మన ఊరు – మన బడి కార్యక్రమంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయాలను వారికి వివరించాలని సూచించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దనున్నామని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరే అవకాశముందన్నారు.
ఎస్సెస్సీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకరోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏ కోర్సు చదివితే భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయి.. స్కాలర్‌షిప్‌లు ఎలా పొందవచ్చనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Prabhas: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. నెక్ట్స్‌కి ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?