CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- నేతన్నలకు ‘నేతన్న బజార్’.. మహిళా శక్తి భవనానికి శ్రీకారం
- రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
- రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లతో పనులు
- కొత్త ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి హోదాలో ఎన్. రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా మూడుసార్లు సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రిగా జిల్లా సమగ్ర రూపురేఖలను మార్చేలా రూ. 345.78 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్ల రగుడు బైపాస్ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్థానిక నేతన్నల సంక్షేమం, మహిళా సాధికారత, విద్యా రంగం , మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ భారీ నిధులను కేటాయించింది.
నేతన్నలకు ‘నేతన్న బజార్’ కొండంత అండ..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, చేనేత-పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సిరిసిల్ల సాంచాలపై ఉత్పత్తి చేసే పెట్టికోట్, పాలియెస్టర్ వస్త్రాల మార్కెటింగ్‌కు వీలుగా కొత్తగా ‘నేతన్న బజార్’ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. చేనేత, పవర్లూమ్ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో మోడల్‌గా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, జీవనోపాధి శిక్షణలతో పాటు వారు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయాలకు ఈ భవనం ప్రధాన కేంద్రంగా నిలవనుంది.
Also Read
రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో రూ. 200 కోట్ల వ్యయంతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను’ నిర్మించనున్నారు. పెద్దూరులో 18 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఈ విద్యా సముదాయంలో 5 నుంచి 12వ తరగతి వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు వసతి, విద్య అందించేలా 64 తరగతి గదులు, డార్మిటరీలు, డైనింగ్ బ్లాక్, క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికితోడు సిరిసిల్ల, కోనరావుపేటలలో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి వసతులు, సైన్స్ ల్యాబ్‌లు, ఐటీ మౌలిక వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ నిర్మాణాలకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
రాజన్న ఆలయాభివృద్ధికి ₹99.40 కోట్లు.. కొత్త ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రూ. 99.40 కోట్లతో చేపట్టే 26 రకాల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ప్రాకారాలు, గోపురాలు, మండపాల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుదీకరణ, షాపింగ్ కాంప్లెక్సులు ఉన్నాయి. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడల్లో రెండు కొత్త ఆర్డీఓ కార్యాలయాలు, నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు (తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి), సబ్ రిజిస్ట్రార్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించనున్నారు. రక్షణ రంగంలో భాగంగా వేములవాడలో కొత్తగా మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ-సిరిసిల్ల పట్టణాల్లో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!