India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం దాయాది దేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పరస్పర వైరం కొనసాగుతున్న వేళ, ఒకే టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చుని భారత్-పాకిస్థాన్ అధికారులు సమావేశమయ్యారు. 2025లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ కీలక సైనిక చర్య, తీవ్ర ఘర్షణల తర్వాత ఒక భారతీయ అధికారిక ప్రతినిధి బృందం పాక్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ భేటీ అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
షాంఘై సహకార సంస్థ (SCO) నేషనల్ కోఆర్డినేటర్ల సమావేశం నిమిత్తం భారత బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. భారత తరఫున ఎస్సీవో నేషనల్ కోఆర్డినేటర్ అలోక్ దిమ్రీ ఈ బృందానికి నేతృత్వం వహిస్తుండగా, పాకిస్థాన్ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్, పాకిస్థాన్లతో పాటు రష్యా, చైనా, ఇరాన్, బెలారస్ సహా సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఎస్సీవో హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలను ప్రస్తుతం పాకిస్థాన్ (2026-27 కాలానికి) నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది (2027 ఆగస్టు)లో ఇస్లామాబాద్‌లోనే ఎస్సీవో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఆ భారీ అంతర్జాతీయ సదస్సు సన్నాహకాలు, కూటమి ఎజెండా, వివిధ దేశాల మధ్య సమన్వయంపై ఈ కోఆర్డినేటర్ల భేటీలో చర్చిస్తున్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
గతంలో అక్టోబర్ 2024లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎస్సీవో సమావేశం నిమిత్తం ఇస్లామాబాద్ వెళ్లినప్పటికీ, ఆ తర్వాత చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ చర్యలతో ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ద్వైపాక్షిక చర్చలు లేనప్పటికీ, అంతర్జాతీయ బహుపాక్షిక వేదికలపై భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే తన గళాన్ని వినిపించేందుకే పాక్ భూభాగంలో ఈ కీలక సదస్సుకు హాజరైనట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!