TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం చేస్తున్న డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థుల కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించిన టీజీ ఈసెట్ (వర్కింగ్ ప్రొఫెషనల్స్)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను టీజీసీహెచ్ఈ (TGCHE) ఆదేశాల మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష కోసం వివిధ విభాగాల నుంచి మొత్తం 345 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబర్ 20, 2026న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష విజయవంతంగా నిర్వహించారు.
ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 303 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీని ద్వారా మొత్తం హాజరు శాతం 87.83%గా నమోదైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలను సెప్టెంబర్ 28, 2026న కన్వీనర్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, టీజీ ఈసెట్-2026 చైర్మన్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం అధికారికంగా విడుదల చేశారు.
Also Read
పరీక్షకు హాజరైన మొత్తం 303 మంది అభ్యర్థులలో 291 మంది ఉత్తీర్ణత సాధించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 96.04 శాతంగా నమోదైంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE), మైనింగ్ ఇంజనీరింగ్, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విభాగాలకు సంబంధించి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. సివిల్ ఇంజనీరింగ్‌లో 87.10 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 98.63 శాతం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 92.77 శాతం, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్‌లో 96.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పూర్తి వివరాలకు https://www.tgecetwp.in/ వెబ్ సైట్ సందర్శించండి.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!