అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్‌ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని మంత్రి వివరించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా…
కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…