Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysore Pak: పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే మన ఇంట్లో ముందుగా గుర్తొచ్చే సాంప్రదాయ మిఠాయిలలో ‘మైసూర్ పాక్’ ఒకటి. ముఖ్యంగా స్వీట్ షాపుల్లో దొరికేలా మధ్యలో బ్రౌన్ షేడ్, పైన కింద లేత పసుపు రంగుతో, లోపలంతా గుల్లగుల్లగా నోట్లో వేస్తే కరిగిపోయే మైసూర్ పాకు టెక్చర్ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. చాలామంది మైసూర్ పాకు చేయడం ఎంతో కష్టమైన పని అనుకుంటారు.
కానీ సరైన కొలతలు, చిన్న చిన్న మెళకువలు పాటిస్తే ఎవరి సహాయం లేకుండా ఒక్క చేత్తోనే ఇంట్లో దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే ఇంట్లో చేశారంటే ఎవరూ నమ్మరు, కచ్చితంగా షాప్ నుండి తెప్పించారనే అనుకుంటారు. మొదటిసారి ట్రై చేసే వాళ్లకు కూడా ఏమాత్రం చెడిపోకుండా, పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్ గుల్ల మైసూర్ పాకును ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
కావలసిన పదార్థాలు
* శనగపిండి: 1 కప్పు
* పంచదార: 2 కప్పులు
* నూనె లేదా నెయ్యి: 2 కప్పులు (పూర్తిగా నెయ్యి అయినా వాడొచ్చు లేదా 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి కలపి కూడా వాడుకోవచ్చు).
* నీళ్లు: 1 కప్పు
* యాలకుల పొడి: ½ టీస్పూన్ (ఆప్షనల్)
* కుంకుమపువ్వు: చిటికెడు (ఆప్షనల్)
తయారీ విధానం
నూనె వేడి చేయడం & పాకం పట్టడం
ముందుగా ఒక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని, అందులో రెండు కప్పుల నూనె లేదా నెయ్యి పోసి మంటను పూర్తిగా తక్కువ మంటలో ఉంచి నిదానంగా కాగనివ్వాలి. అదే సమయంలో పక్కనే ఉన్న మరో బర్నర్‌పై అడుగు మందంగా ఉండే కడాయిని ఉంచి, అందులో రెండు కప్పుల పంచదారతో పాటు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు గరిటతో కలుపుతూ ఉండాలి.
తీగ పాకం & పిండి కలపడం
పంచదార పూర్తిగా కరిగి మరిగిన తర్వాత, మంచి సువాసన మరియు రంగు కోసం చిటికెడు కుంకుమపువ్వు, అర టీస్పూన్ యాలకుల పొడిని చేర్చుకోవాలి. గరిటతో కలుపుతూ తీగ మధ్యలో తెగిపోకుండా చక్కటి పొడవాటి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఇలా పాకం రాగానే స్టవ్‌ను పూర్తిగా సిమ్‌లో ఉంచి, ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. విస్కర్ లేదా గరిటె సహాయంతో ఉండలేమీ కట్టకుండా సాఫ్ట్‌గా కలిపితే, మూడు నుంచి ఐదు నిమిషాల్లో పిండి చక్కగా పాకంలో ఉడికిపోతుంది.
వేడి నూనె చేర్చడం
శనగపిండి మిశ్రమం ఉడుకుతున్న దశలో మంటను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చాలి. పక్క స్టవ్‌పై కాగుతున్న వేడి నూనెను ఒక్కొక్క గరిటె చొప్పున తీసి ఈ శనగపిండి మిశ్రమంలో పోస్తూ ఆగకుండా కలుపుతూ ఉండాలి. పోసిన నూనెను పిండి పూర్తిగా పీల్చుకున్న తర్వాత మాత్రమే తర్వాతి గరిటె నూనెను జోడించాలి. ఇలా సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు నూనె పోస్తూ కలుపుతుంటే, మిశ్రమం చక్కగా నురుగులా మారి పాత్ర అంచులను వదిలేస్తూ గుల్లగా పైకి లేస్తుంది. ఆ సమయంలో మిగిలిన నూనెను కూడా పోసి, ఎక్కువసేపు తిప్పకుండా వెంటనే ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న లోతైన పాత్రలోకి మార్చుకోవాలి.
గాట్లు పెట్టడం
మిశ్రమాన్ని గిన్నెలోకి వేసిన తర్వాత పైభాగం మాత్రమే సమానంగా సర్దాలి తప్ప గరిటెతో అస్సలు ఒత్తకూడదు. ఒకటి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేస్తే మిశ్రమం కొద్దిగా నిలకడగా మారుతుంది. ఇంకా వేడిగా, మెత్తగా ఉన్నప్పుడే కత్తితో లోపలి వరకు దిగేలా కావలసిన సైజులో గాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టి, ఏమాత్రం కదపకుండా కనీసం 4 నుంచి 5 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. పాత్రలో ఉండే సహజమైన ఆవిరి వేడికి లోపలి భాగం చక్కగా మగ్గి, స్వీట్ షాపుల్లో ఉండే మాదిరిగా మధ్యలో డార్క్ బ్రౌన్ రంగు సంతరించుకుంటుంది.
మిశ్రమం పూర్తిగా చల్లారి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మూత తీసి, అంచులను కత్తితో తేలికగా కట్ చేసుకోవాలి. ఆపై ఆ పాత్రను ప్లేట్లోకి బోర్లిస్తే గుల్లగా ఉండే మైసూర్ పాకు ముక్కలు చాలా సులభంగా విడివడి బయటకు వచ్చేస్తాయి.
పర్ఫెక్ట్ టెక్చర్ కోసం చిట్కాలు
* శనగపిండి మిశ్రమం పాత్రను వదిలేసి నురుగులా మారిన వెంటనే గ్రీస్ చేసిన గిన్నెలోకి బదిలీ చేయాలి. ఇంకా నూనె మిగిలి ఉంది కదా అని ఎక్కువసేపు స్టవ్‌పైనే ఉంచి వేయిస్తే, మిశ్రమం పొడిబారిపోయి మైసూర్ పాకు మెత్తదనం కోల్పోయి రాళ్లలా గట్టిగా మారిపోతుంది.
* మిశ్రమాన్ని లోతైన పాత్రలోకి పోసిన తర్వాత గరిటెతో గట్టిగా అదిమి పెట్టకూడదు. అలా అదమడం వల్ల లోపల సహజంగా ఏర్పడే ఎయిర్ పాకెట్స్ (గాలి రంధ్రాలు) మూసుకుపోయి, మైసూర్ పాకుకు రావాల్సిన గుల్లదనం దెబ్బతింటుంది.
* గిన్నెలోకి పోసి గాట్లు పెట్టిన వెంటనే మూత పెట్టడం చాలా ముఖ్యం. లోపల ఉండే అధిక ఉష్ణోగ్రత మూత పెట్టడం వల్ల అలాగే ఉండి, మైసూర్ పాకు లోపల వరకు మంచి రంగు, సరైన ఆకృతితో పాటు అద్భుతమైన రుచిని సంతరించుకుంటుంది.
తాజావార్తలు
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!