OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
- పుంగనూరులో మళ్ళీ హై వోల్టేజ్ పాలిటిక్స్
- మున్సిపల్ ఎన్నిక ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద?
- పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు టీడీపీ ప్లాన్
- పెద్దిరెడ్డిని సొంతూళ్ళోనే దెబ్బ కొట్టాలన్న కసి
- అసెంబ్లీ ఛాన్స్ మిస్ అయినా మున్సిపాలిటీలో షాక్ ఇవ్వాలని..
- అధికార పార్టీ వ్యూహాలకు దీటుగా పెద్దిరెడ్డి ప్లాన్స్?
- పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : స్థానిక సమరం ముంగిట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మిగతా వాటికంటే ఎక్కువగా పెరిగిపోతోంది. అన్నిటికీ మించి అందరి దృష్టి ఇప్పుడు పుంగనూరు వైపే ఉంది. వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి వార్ వన్‌సైడే అన్నట్టు ఉంది. అందుకే…ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం కాబట్టి…మా సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు టీడీపీ లీడర్స్. అదే సమయంలో తమ పట్టు తగ్గకుండా వైసీపీ ముఖ్యులు తీసుకుంటున్న చర్యలతో పుంగనూరులో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇది కేవలం ఒక మున్సిపాలిటీ ఎన్నికో, లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికో కాదని, అది పూర్తిగా ఉమ్మడి జిల్లా మీద ప్రభావం చూపే అంశమని నమ్ముతున్నాయట రెండు వర్గాలు. ఆ దిశగా రెండు పార్టీల అధిష్టానాల నుంచి ఇప్పటికే క్షేత్ర స్థాయికి సంకేతాలు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నించింది. అయితే…. పెద్దిరెడ్డి గెలిచినా మెజార్టీ మాత్రం బాగా తగ్గింది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా పుంగనూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి వాళ్ల సొంత ప్రాంతంలోనే చెక్ పెట్టాలన్నది అధికార పార్టీ ప్లాన్ అట. గట్టి సమాధానం చెప్పాలన్న వ్యూహంతో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రణాళికలతో పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తాము మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటే… పెద్దిరెడ్డి రాజకీయ కోటకు బీటలు వారినట్టేనని తమ్ముళ్లు గట్టిగా నమ్ముతున్నారట. అందుకోసం ప్రతి వార్డునూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాన్ని ఇప్పట్నుంచే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలలో పెద్దిరెడ్డిని ఓడిస్తానని డైరెక్ట్‌గానే సవాల్ చేశారు సీఎం చంద్రబాబు. అది తృటిలో తప్పిపోయినా… మున్సిపాలిటీలో మాత్రం గట్టి షాక్ ఇవ్వాలని లోకల్ లీడర్స్‌కు పై నుంచి ఆదేశాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్గా చల్లా బాబును తప్పించి మధసూదన్ నాయుడుని బరిలో దింపడం అందులో భాగమేనని అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. అలాగే… స్థానిక ఎన్నిక బాద్యతల్ని పార్టీ సీనియర్ నేతలకు అప్పగించబోతున్నారట. అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం తన కంచుకోట బీటలు వారకుండా…కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ప్లాన్స్‌ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో పుంగనూరు స్థానిక సమరం అంగబలం, అర్థ బలాల మధ్య నడిచే రణరంగంగా మారబోతోందని చెప్పుకుంటున్నారు. కేడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి, అసమ్మతి కుంపట్లను ఆర్పేసి, ప్రజల నాడిని పట్టుకుని ఓట్లను కొల్లగొట్టే వ్యూహాన్ని ఎవరు సక్రమంగా అమలు చేస్తే… వాళ్ళదే గెలుపు అంటున్నారు పరిశీలకులు. ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోవడంతో…ఏ పార్టీ గెలిచినా మరొకరికి షాక్ తప్పదన్న అంచనాలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!