Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Etelarajender Challenge To Cm Kcr

Etela rajender: హుజురాబాద్ లో చర్చకు నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? సీఎంకు ఈటెల సవాల్‌..

Published Date :April 16, 2023 , 2:49 pm
By NTV WebDesk
Etela rajender: హుజురాబాద్ లో చర్చకు నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? సీఎంకు ఈటెల సవాల్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Etala rajender: హుజూరారాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సంచలన వాఖ్యలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్‌ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అక్రమ కేసులకు నిరసనగా కరీంనగర్‌ జిల్లా బీజేపీ ధర్నాలో ఈటెల పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కోట్లు పంచారని మండిపడ్డారు. ఆ డబ్బుల్ని మానేరు నదిలో ఇసుకను తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తోడల్లుడికి తనుగుల చల్లూర్ లాంటి గ్రామాల్లో ఇసుక క్వారీలు కట్టబెట్టి వందలకోట్ల విలువ చేసే ఇసుక కొల్లగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ దళిత భూములపై కేసీఆర్ కన్ను పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం కట్టారు దానికి సెల్యూట్ చేసి వస్తా అని అన్నారు. అంబేద్కర్ కు దండ వేయకుండా అడ్డుకున్నది నువ్వుకాదా? అని ప్రశ్నించారు. విగ్రహం పెట్టగానే అయిపోదన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగం పనికి రాదు మార్చాలని అన్న నీకు రాజ్యాంగ నిర్మాతకు దండేసే హక్కులేదని ఆరోపించారు. జిప్పు తీసి చూపించిన వాళ్లు, రాళ్లతో కొట్టిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారని, నిజమైన తెలంగాణ బిడ్డలు నీ వెంట లేరని మండిపడ్డారు. సీఐ నువ్ చిన్న మనిషివి బిడ్డా నీ బతుకు ఎందో సంవత్సర కాలంలోనే చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదేమైన నిషేధించిన పార్టీనా? ఊదితే కొట్టుకు పోతారు.. నేను గెలిచిన ఎమ్మెల్యే ను ఇక్కడ? ఓడిపోయిన వాళ్ళు హుజురాబాద్ లో లీడర్లు అయిపోయారని మండిపడ్డారు. అహంకార పూరితంగా వ్యవవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎంని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగుతోందని అన్నారు. సర్పంచ్ మహేందర్ కేసీఆర్ డబ్బులకు అమ్ముడు పోకుండా సైకోలకు బెదరలేదన్నారు. ఉప ఎన్నికల్లో బెదరని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీణవంకలో వేరే పార్టీ జెండాలు ఉండవద్దట అన్నారు. అరే కొడకా నువ్ చిన్న మనిషివి రా ? అని ప్రశ్నించారు.

Also Read

  • Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
  • RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
  • IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
  • Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట

వేల ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బందు ఎలా ఇస్తావ్ అన్నందుకు మెడలు పట్టి బయటకు వెల్లగొట్టాడని ఆరోపించారు. నా సంపాదన మీద ఉక్కు పాదం మోపావ్.. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మీద ఎవరిని ఎంటర్ కనియ్యలేదన్నారు. మానేరు నది చేర బట్టి… కేసీఆర్ బంధువులు మేసిన్లు పెట్టి ఇసుకను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఎవడ్రా కొడకా? మా సొమ్ముతో నువ్ బతుకుతున్నావ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో 2006 నిలబడిన నాడు… ఆనాటి ప్రభుత్వం నిన్ను ఓడగొట్టాలని రాజశేఖర్ రెడ్డి కోట్లు పంచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేయమని అన్నావ్ కదా కేసీఆర్.. 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని ప్రశ్నించారు. మా నోరు…కడుపు కొట్టి అక్రమంగా సంపాదించిన డబ్బు బెంగాల్,బీహార్ పంపిస్తావ్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్‌ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ వ్యంగాస్త్రం వేశారు. ప్రాణానికి వేళ కట్టే మూర్ఖపు నాయకుడివి నువ్ కేసీఆర్ అని మండిపడ్దారు.

డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి అవ్వలేదన్నారు. దళిత బందు పూర్తిగా ఇవ్వలేదని, 10లక్షల రూపాయలు దళిత బిడ్డల పంచె వరకు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టవద్దన్నారు. మునుగోడులో గిరిజన బందు అన్నాడు అయినా ఇంత వరకు జి.ఓ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ దళిత బిడ్డలకి అందరికి దళిత బందు రాకపోతే నీ భరతం పడత అని మండిపడ్డారు. చదువుకున్నోడికి నౌకరి వస్తది అనుకున్న…డబ్బులు ఉన్నోడికి వస్తున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీ పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. నందిపేట ఊరిలో సర్పంచ్ దంపతులు పెట్రోల్ పోసుకొని తగలబడతా అని పోయారని తెలిపారు. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల బాధలో ఇరుక్కు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శిలను ఏమి రా అంటున్నాడు.. మీ నాయకులకు పద్ధతి నేర్పు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ముందు మూడు… వెనక మూడు పోలీస్ వాహనాలు పెట్టుకొని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Puvvada Ajay Kumar: కేసీఆర్ చెయ్యి వదిలిన వారంతా శంకరగిరి మాన్యాలకు పోతారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • cm kcr
  • Etelarajender
  • Etelarajender challenge to CM KCR

తాజావార్తలు

  • RCB vs GT: మొదటి ఓవర్‌లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!

  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

  • Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్

  • Gujarat: సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన

  • CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions