నిరు పేదలు ఏ కులంలో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… అత్యధికంగా జైలుకు పోయి వచ్చిన బిడ్డ ఈటల. నేను హుజురాబాద్ లో 90శాతం అభివృద్ది చేశాను. మిగిలిన 10శాతం కూడ నా రాజీనామాతో పూర్తి అవుతుంది అని తెలిపారు. నాలాంటి బక్క పలుచని వ్యక్తి మీద కేసీఆర్, అతని అల్లుడు, కుటుంబం, తొత్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దాడి చేస్తున్నారు. నేను హంతక ముఠాకు నాయకత్వం వహించిన అని ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు ఈటల.