Etela Rajender: కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లోకి వెళ్లారు.. ఈటెల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender sensational comments on T.Congress party: గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారని, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఇంకా శక్తి కావాలి అంటున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయని, నిన్నటి వరకు కాంగ్రెస్ లేవదని చర్చ జరిగిందని గుర్తు చేశారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని హుజూరాబాద్ ఈటెల ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు అని చెప్పేవాడని గుర్తు చేశారు. అనంత గిరిగా లకోమ్ మరిజోమ్ క దవా అని చెప్పేవారని అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల కోసం 111 జీవో తీసివేస్తా అంటున్నాడని మండిపడ్డారు.
నిజాం కాలంలో 1908 లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 15 వేల మంది చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత జంట జలాశయాలు నిర్మాణము చేశారని అన్నారు. దీనితో వరద నివారణ, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, భూగర్భజలాలు లాంటి నాలుగు ప్రయోజనాలు వచ్చాయని అన్నారు. ఇప్పుడు గోదావరి కృష్ణ నుంచి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు.. కేసీఆర్ అనుచరులు వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రైతుల దగ్గర భూములు లేవు, 18 వేల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో ఎంత ఎండ ఉన్నా సాయంత్రం అయ్యే సరికి చల్లబడడానికి కారణం అక్కడ ఉన్న చెట్లు అని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తక్షణమే ఆపివేసి… సమీక్ష చేయాలని కోరారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోయిందని, ఇప్పుడు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోతుందని ఈటెల పేర్కొన్నారు. ధరణి రైతుల కొంప ముంచిందని, దరణిలో 14 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
తెలంగాణ రైతులు నిశ్చింతగా నిద్ర పోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 613 మియాపూర్ భూములు ఏమయ్యాయి? నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. మియాపూర్ స్కాం ఎందుకు బయట పెట్టట్లేదని? ప్రశ్నించారు. ఇలా వచ్చిన డబ్బుతో రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. నాలాంటి వాళ్ళ గొంతు కోయాలని ఓటు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఆరోపణలు గుప్పించారు. కొత్త సచివాలయంలో ఎమ్మెల్యే లకు కూడా అనుమతి లేదు, సామాన్య పబ్లిక్ కు అసలు అనుమతి లేదని మండిపడ్డారు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూశానని, మా అధ్యక్షుడికి, తనకు గొడవ అయినట్టు, సెల్ ఫోన్ లు విసిరి వేసుకున్నట్టుగా వార్తలు రాసారని మండిపడ్డారు. ఇలాంటి పనులు తను చేయనని స్పష్టం చేశారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయని, నిన్నటి వరకు కాంగ్రెస్ లేవదని చర్చ జరిగిందని గుర్తు చేశారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా? అంటూ ఈటెల ప్రశ్నించారు.
Revanth Reddy: నేను లోక్‌సభ ఎంపీ నీ.. నన్ను ఎందుకు అరవింద్ కుమార్ కలవడు?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!