YouTube channels Ban: భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందకు పైగా యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. తాజాగా మరో 6 ఛానెళ్లపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బ్యాన్ విధించింది. ఈ ఆరు ఛానెళ్లు సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర గుర్తించింది. వీరటికి దాదాపుగా 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెళ్ల పోస్ట్ చేసిన వీడియోలను 51 కోట్ల సార్లు చూశారు.
Read Also: CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది
నేషన్ టీవీ, సరోకర్ భారత్, నేషన్ 24, సంవాద్ సమాచార్, స్వర్ణిమ్ భారత్, సంవాద్ టీవీ అనే ఆరు యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేశారు. ఐ అండ్ బీ మంత్విత్వ శాఖ నకిలీ వ్యాఖ్యలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంట్లో భాగంగానే తాజాగా వీటిని బ్యాన్ చేసింది. 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు సంవాద్ టీవీ భారత ప్రభుత్వం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. కేంద్రమంత్రులపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది.
భారతదేశ జాతీయ భద్రత, సమగ్రతకు భంగం కలిగించడంతో పాటు వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచుతున్న కారణంగా ఇప్పటి వరకు 104 యూట్యూబ్ ఛానెళ్లు, 45 వీడియోలు, నాలుగు ఫేస్‌బుక్ ఖాతాలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్‌సైట్‌లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ లో ప్రకటించింది. పీఐబీ ప్యాక్ట్ చెక్ ఈ ఛానెళ్ల బాగోతాన్ని బయటపెట్టింది. భారతదేశ ఎన్నికలు, సుప్రీంకోర్టు, భారత్ పార్లమెంట్, భారత ప్రభుత్వం పనితీరు మొదలైన వాటి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశాయి.
A YouTube channel ‘Swarnim Bharat’ with over 1,013,013 views has been found to be propagating #FakeNews about the Prime Minister, Union Ministers, Election Commission of India & Supreme Court of India. @PIBFactCheck found almost all of its content to be fake. Here’s a thread.. pic.twitter.com/tyNzsK7DbT
— PIB Fact Check (@PIBFactCheck) January 12, 2023