Vontimitta Kodandarama Kalyanam: ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vontimitta Kodandarama Kalyanam: సాధారణంగా సీతారాముల కల్యాణం శ్రీరామ నవమి రోజు జరుగుతుంది.. కానీ, భక్తులు ఆంధ్ర భద్రాదిగా భావించే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం.. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా కోదండరాముని కల్యాణం నిర్వహిస్తారు.. ఈ మహోత్సావానికి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ రాత్రి కోదండ రాముడి కల్యాణ క్రతువుకు శాస్త్రోక్తంగా నిర్వహించబోతున్నారు.. లక్ష మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.. అయితే, షెడ్యూల్ ప్రకారం సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఒంటిమిట్టకు రావాల్సి ఉన్నా.. కాలికి గాయం కారణంగా ఆయన పర్యటన రద్దు కావడంతో.. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి లేదా టీటీడీ ఛైర్మన్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసేలా ఏర్పాటు జరుగుతున్నాయి..
Read Also: London School of Economics: భారతీయుడు-హిందూ అంటే ద్వేషం.. ఓ స్టూడెంట్ ఆవేదన
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి.. రాత్రికి పండు వెన్నెల్లో కోదండరాముని కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, ఉదయం జగదభిరాముని ఊరేగింపు నిర్వహిస్తారు.. ఒంటిమిట్టలో శ్రీరాముడి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. సర్వాంగ సుందరంగా కల్యాణవేదికను ముస్తాబు చేశారు.. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఒంటిమిట్టలో కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కడప-తిరుపతి ప్రధాని రహదారికి పక్కనే ఈ ఆలయం ఉండడంతో.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత కడప- తిరుపతి ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిపివేయనున్నారు.. తిరుపతి నుంచి వచ్చే వాహనాలను రాయచోటిమీదుగా కడపకు, కడప నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి నిర్వహించే సీతారాముల కల్యాణానికి 52 ఎకరాల విస్తీర్ణంలోని శాశ్వత కల్యాణ వేదికలో దాదాపు లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. పండువెన్నెల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణ క్రతువును కన్నుల పండుగ నిర్వహించబోతున్నారు.. పురాణాల ప్రకారం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం కాంతకోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు.. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. 11 వ శతాబ్దం నుంచి ఇక్కడ కోదండరాముడికి విశేష పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కోదండరాముడి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాల నుంచి ఒంటిమిట్టకు ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!