TS Water Problems: తెలంగాణలో మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8గంటలకు బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక మధ్నాహ్నం అయితే ఎండలు అగ్ని గోళాన్ని తలపిస్తున్నాయి. దీంతో నీటి ఎద్దటి మొదలైంది. కాగా.. ఒక వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడంతో.. ప్రధానంగా వెస్ట్‌జోన్‌లో నీటి ట్యాంకర్లలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక.. వచ్చేనెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యక్రమాలు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి దానకిషోర్‌తో కలిసి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అయితే.. గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందని దానకిషోర్ వివరించారు. ఇక వినియోగదారుల నుంచి డిమాండ్‌కు తగ్గట్టుగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Read also: BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
దీంతో.. రోజుకు 9 వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాణిజ్య వినియోగదారుల కోసం 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేయబడతాయి. ఇందుకోసం కొత్తగా 250 ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర మార్గాల ద్వారా 250 మంది డ్రైవర్లను నియమించనున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నాటికి అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం 7 డివిజన్లలో మొత్తం 20 కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు, జీహెచ్‌ఎంసీలో ఆరు, జీహెచ్‌ఎంసీకి మించిన ఓఆర్‌ఆర్‌లో 14 ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆలస్యమైతే SMS ద్వారా సమాచారం అందించాలి.
Shivsena: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఏక్నాథ్ షిండే..