MP Gorantla Madhav Live : నేను చెప్పింది చేస్తే రాజీనామా చేస్తా..!
ఫేక్ వీడియోతో బీసీ ఎంపీని కించపరిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. చంద్రబాబు తైతక్కలాట ఆడాల్సిన అవసరం లేదు.. ఓటుకు నోటు వీడియో మీద చంద్రబాబు ప్రమాణం చేస్తారా? నేను కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా.. నా ఛాలెంజ్ స్వీకరించేందుకు చంద్రబాబు సిద్ధమా? అని ప్రశ్నించారు. .అది ఫేక్ వీడియో అని ఒప్పుకుని చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి.. నా వీడియో నిజమని నిరూపిస్తే రాజీనామా లేఖను నీ ముఖం మీద విసిరేస్తా.. చివరకు గెలిచేది నేనే.. కాణిపాకం రావడానికి ఎప్పుడైనా నేను రెడీ అన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఈవ్యవహారంపై తాను డీజీపీకి కంప్లైంట్ చేశానన్నారు.