Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలను విడదీసి పటాన్ చెరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్‌లోని రామాయంపేట, నిజాంపేట్, శంకరంపేట రూరల్ మండలాలను, తుప్రాన్ రెవెన్యూ డివిజన్‌లోని నార్సింగి మండలాలను విడదీసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు ఆయా జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా దరఖాస్తులు అందజేయవచ్చు.
Read also: Nirmal: నిర్మల్ జిల్లాలో ఆదివాసీ అవస్థలు.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని మెదక్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీఎం వెంటనే స్పందించి ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), నార్సింగి మండలాలను రామాయంపేట రెవెన్యూ డివిజన్‌గా విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
NEET Fake OMR: నీట్‌లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా