Telangana DGP: సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలని సినీ ప్రముఖులకు.. తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారని డీజీపీ తెలిపారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులతో రెండు గంటలపాటు సాగిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్ ఘటనపై మాట్లాడారు. పోలీసుల నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు గౌరవించాలని అన్నారు. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలని అన్నారు. ఇటీవల బౌన్సర్లు తీరు, ప్రవర్తన బాగలేదని మండిపడ్డారు. ఏ ఈవెంట్ అయినా ముందోస్తు అనుమతులు తీసుకోవాలని టాలీవుడ్ ప్రముఖులకు తెలంగాణ డీజీపీ సూచించారు.
Read also: Tollywood Team: సీఎం రేవంత్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు ఏమన్నారంటే..
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వీడియోలను సినీ ప్రముఖులకు చూపించారు. సంధ్య థియేటర్ లో రేవతి మృతి, తొక్కిసలాట, శ్రీతేజ అపస్మారక దృష్యాలను పోలీసులు సినీ ప్రముఖులకు చూపించారు. హీరో అల్లు అర్జున్ ఎప్పుడు సంథ్యా థియేటర్ కు వచ్చారు దేరారు, అల్లు అర్జున్ రాకతో తొపులాట ఘటన జరిగిన అల్లు అర్జున్ ఎప్పటి వరకు సినిమాను వీక్షించారనేది తెలిపారు. పోలీసులు ఘటన వివరాలు తెలిపిన అల్లు అర్జున్ ఎప్పుడు స్పందించారన్న దానిపై చిక్కడ పల్లి పోలీసులు వీడియో ద్వారా తెలిపారు.
Read also: CM Revanth Comments: నో బెనిఫిట్ షో.. టాలీవుడ్ ఇండ్రస్ట్రీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్..
అయితే డీజీపీ, సీఎం రేవంత్ రెడ్డి మాటలకు స్పందించిన సినీ ప్రముఖులు సంధ్యా థియేటర్ ఘటన బాధాకరం అన్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందన్నారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను.. హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని తెలిపారు.
Read also: Government Proposals to Tollywood: టాలీవుడ్‌కు ప్రభుత్వం ఐదు ప్రతిపాదనలు..
ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అన్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని తెలిపారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో.. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలన్నారు. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని సీఎం, డీజీపీతో సినీ ప్రముఖులు తెలిపారు.
Bhadrachalam: రామయ్య సన్నిధిలో కొత్త విధానం.. అన్నదాన సత్రంలో డిజిటల్ టోకెన్లు..