Talasani Srinivas: 70 ఏండ్ల లో జరగని అభివృద్ధి ఈ 9 ఏళ్ళలో జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కరువు కటకలతో అలమటించిన తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలుపరిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి పోవడం గర్వకారణమన్నారు. 70 ఏండ్ల లో జరగని అభివృద్ధి ఈ 9 ఏళ్ళలో జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కరువు కటకలతో అలమటించిన తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందన్నారు. కాళేశ్వరం నీళ్లతో మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ఆలోచనతో రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు.
Bandi sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికి ఉచిత విద్య అందిస్తాం