Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో కంమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘లవ్ టుడే’ మూవీతో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా అతనికి చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం యువత ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రజంట్ ప్రదీప్ ‘డ్రాగన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు ప్రదీప్. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ‘డ్రాగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల్లో పాల్గొన్న ప్రదీప్ తన కెరీర్ స్టార్టింగ్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు.
Also Read:Nag Ashwin :బాలీవుడ్ బ్యూటీ తో నాగ్ అశ్విన్ మూవీ..?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రదీప్ మాట్లాడుతూ.. ‘నన్ను తొక్కేయాలని అని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.. అంతా చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క పెరగడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాల్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ‘లవ్ టుడే’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆలోచించారు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని.. పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజెక్ట్ చేసిన వారందరికీ అదే మూవీ హిట్ తో నను నేను నిరూపించుకున్నాను’ అని అన్నాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!