Osmania Hospital : మృతదేహం కోసం వచ్చిన బంధువులు.. అసలు విషయం తెలిసి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్‌దేవ్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు.
అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియల అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే మరుసటి రోజు మరొక కుటుంబం మార్చురీకి చేరుకుంది. రెండవ గుర్తు తెలియని మృతదేహం తమ బంధువు కాదని తెలపడంతో అధికారులు అప్రమత్తయ్యారు.
Also Read
విచారించగా మొదటి కుటుంబం తప్పుగా మృతదేహాన్ని గుర్తించినట్లు మార్చురీ అధికారులు నిర్థారణకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన వారు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు.
“ఓజీహెచ్ మార్చురీలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి సోదరుడు పొరపాటున ఒక మృతదేహాన్ని గుర్తించి మార్చురీ నుండి తీసుకువెళ్లాడు. తరువాత మరొక కుటుంబం వచ్చి తమకు చెందిన మృతదేహం గురించి తెలపడంతో మార్చురీ అధికారులు వెంటనే మొదటి కుటుంబాన్ని అప్రమత్తం చేశారు. తరువాత మేము రెండు మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేశాము ”అని ఓజీహెచ్ సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!