Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్
- దానం నాగేందర్ క్లీన్ చిట్‌పై కోర్టు మెట్లెక్కిన వివాదం
- స్పీకర్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
- ఫిరాయింపు ఆరోపణలపై మళ్లీ చర్చ
- హైకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం మెట్లెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. బీఆర్ఎస్ బీ-ఫామ్ ద్వారా గెలిచి మరో పార్టీలోకి వెళ్లినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్, దానం నాగేందర్ అసలు పార్టీ మారలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, బహిరంగంగానే పార్టీ మారిన వ్యక్తికి స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లో అసెంబ్లీ స్పీకర్‌ను , దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ కీలక పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) ధర్మాసనం ఎల్లుండి విచారణ జరపనుంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఏ రకమైన స్పందన తెలియజేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో పిటిషనర్ తరపున, స్పీకర్ తరపున , దానం నాగేందర్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.
Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్!
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!