Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Cleaning Tips: ప్రతి ఆదివారం సగం రోజు మనకి ఇల్లు తుడవడంతోనే, సామాన్లు సర్దుకోవడంతోనే సరిపోతోందా? ముందు ఇల్లంతా ఊడవటం, ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న వస్తువులను యథాస్థానంలో పెట్టడం, కిచెన్ క్లీన్ చేయడం.. అబ్బో! ఈ హడావుడి ముగిసేసరికి ఎంతో అలిసిపోతాం. “మళ్ళీ వచ్చే ఆదివారం కూడా ఇదే కథ కదా” అని తలచుకుంటేనే విసుగొస్తుంది. కానీ అసలు ఇల్లు సర్దే ప్రసక్తే లేకుండా, అసలు సామాన్లు చెల్లాచెదురుగా పడేసే అవకాశమే లేకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది? వాస్తవానికి.. జపాన్ ప్రజలు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంలో ఒక ప్రత్యేకమైన శైలిని పాటిస్తారు. దానికోసం వేలకు వేలు పెట్టి డిజైనర్ బాక్సులు, ఆర్గనైజర్లు కొనాల్సిన పనిలేదు. అలాగని రోజులో గంటల తరబడి తుడిచి తుడిచి చేతులు నొప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా చిన్న చిన్న అలవాట్లను రోజూవారీ జీవితంలో భాగం చేసుకుంటారు. ఒక వస్తువు వాడాక వెంటనే దాని స్థానంలో పెట్టడం, అవసరం లేని సామాన్లను అనవసరంగా ఇంట్లో పేర్చుకోకపోవడం, ఇంట్లో కొంత ఖాళీ స్థలానికి ప్రాధాన్యత ఇవ్వడం.. ఇవే వారి రహస్యాలు. ఈ సూత్రాలను మనమూ పాటిస్తే ఆదివారం నాటి భారాన్ని సులువుగా తగ్గించుకోవచ్చు. ఆ జపనీస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిది ‘వన్ టచ్ రూల్’. మన ఇంట్లో సగం చెత్త పెరిగేది మన బద్ధకం వల్లే. ఆఫీస్ నుంచి రాగానే బ్యాగును సోఫాలో పడేయడం, తాళాలు డైనింగ్ టేబుల్ మీద వదిలేయడం, టీ తాగిన కప్పును కిచెన్ మేడ మీద పెట్టేసి “ఆ తర్వాత సర్దుదాం లే” అనుకోవడం మనం చేస్తుంటాం. జపనీస్ పద్ధతి ఏంటంటే.. ఒక వస్తువును చేతిలోకి తీసుకున్నామా, వాడామా, వెంటనే దాని అసలు స్థానంలో పెట్టేసామా! అంతే. దీనివల్ల తర్వాత ప్రత్యేకంగా సమయం కేటాయించి ఇల్లంతా సర్దాల్సిన పని ఉండదు.
Also Read
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
రెండోది బయటి మురికిని ఇంట్లోకి రానివ్వకపోవడం. జపాన్‌లో ఇంటి ముఖద్వారం లేదా ఎంట్రీ ఏరియాను ‘గెంకాన్’ అంటారు. దానికి వారు చాలా ప్రాధాన్యం ఇస్తారు. బయటి నుంచి రాగానే చెప్పులు, షూస్ అక్కడే విప్పేస్తారు. మనం కూడా తలుపు దగ్గరే ఒక షూ ర్యాక్, డోర్ మ్యాట్, ఇంట్లో వేసుకునే చెప్పులు సిద్ధంగా ఉంచుకుంటే బయటి దుమ్మూ ధూళి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. దీనివల్ల పదే పదే ఇల్లు తుడవాల్సిన శ్రమ తగ్గుతుంది.
మూడోది ‘మొత్తైనాయ్’ (Mottainai) మైండ్ సెట్. పాత ఛార్జర్లు, వాడని ప్లాస్టిక్ డబ్బాలు, వైర్లు, గిఫ్ట్ బాక్సులు, షాపింగ్ బ్యాగులు.. “ఏమో, ఎప్పుడైనా పనికొస్తాయేమో!” అని ఇంట్లో మూలల్లో దాచిపెట్టడం మనకి అలవాటే. కానీ ‘మొత్తైనాయ్’ అనే జపనీస్ భావన వస్తువులను గౌరవించమంటుంది తప్ప అనవసరంగా దాచి ఉంచమని చెప్పదు. పనికిరాని వస్తువులను ఇంట్లో పోగేయకుండా అవసరమున్న వారికి ఇవ్వడం లేదా రీసైకిల్ చేయడం చేయాలి. ఈ రోజు నుంచే ఒక డెస్క్ లేదా కప్బోర్డ్ ఓపెన్ చేసి, “అసలు ఈ వస్తువు ప్రస్తుతం నా జీవితంలో ఉపయోగపడుతుందా?” అని ప్రశ్నించుకుని అనవసరమైన వాటిని తీసేయండి.
నాలోగోది రోజువారీ చిన్న చిన్న శుభ్రతలు. వారమంతా ఇల్లు పాడుచేసి ఆదివారం ఒక్క రోజే గంటల తరబడి శుభ్రం చేసే కంటే, రోజుకి కొన్ని నిమిషాలు కేటాయించడం మేలు. తిన్న వెంటనే టేబుల్ తుడవడం, వాడిన కప్పును వెంటనే కడిగేయడం, వంట అయ్యాక కిచెన్ ప్లాట్‌ఫారమ్ తడి గుడ్డతో తుడవడం, స్నానం పూర్తి కాగానే బాత్రూమ్ వైపర్‌తో నీళ్లు తోసేయడం.. ఇవి చేయడానికి నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు. కానీ ఈ చిన్న అలవాట్లు పెద్ద మురికి పేరుకుపోకుండా కాపాడతాయి.
ఐదోది ప్రతి వస్తువుకూ ఒక ‘సొంత ఇల్లు’ ఉండాలి. తాళాల చెవులు, ఇంట్లోని రిమోట్లు, ముఖ్యమైన పేపర్లు వేతికి వేసారడానికి కారణం వాటికంటూ ఒక స్థిరమైన స్థానం లేకపోవడమే. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ముందుగానే ఒక ఫిక్స్డ్ ప్లేస్ అనుకోవాలి. కీస్ ఎక్కడ పెట్టాలి, బ్యాగ్ ఎక్కడ తగలగించాలి, పేపర్లు ఏ డ్రాయర్లో ఉండాలి అనేది ముందే నిర్ణయిస్తే, వెతికే సమయం వృథా కాదు, ఇల్లూ గందరగోళంగా మారదు.
ఆరోది నేల ఖాళీగా ఉంచడం, గోడలను వాడుకోవడం. చిన్న ఇల్లు ఉన్నప్పుడు సామాన్లన్నీ నేలమీదే పేర్చితే ఇల్లు మరింత ఇరుకుగా అనిపిస్తుంది. అందుకే ఫ్లోర్ ఖాళీగా ఉంచి గోడలను వాడుకోవాలి. కిచెన్‌లో గోడలకు హుక్స్, అల్మారాల్లో హ్యాంగింగ్ ఆర్గనైజర్లు, వాల్ షెల్ఫ్‌లు వాడితే స్థలం కలిసివస్తుంది. అలాగే ఇంట్లోని ప్రతి ఖాళీ స్థలాన్ని ఏదో ఒక వస్తువుతో నింపాల్సిన అవసరం లేదు. జపనీస్ డిజైన్‌లో ‘మా’ (Ma) అనే కాన్సెప్ట్ ఉంది. అంటే “ఖాళీ స్థలానికి ఉన్న అందం”. నేల ఖాళీగా, తెరిచి ఉన్నట్లు ఉంటే చిన్న గది కూడా విశాలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది.
అసలు రహస్యం ఏంటంటే.. ఇంట్లో గందరగోళాన్ని చేరనివ్వకపోవడమే! రోజు ఎక్కువగా ఊడ్చి తుడవడంలో కాదు, అసలు మురికి చేరుకోకుండా, సామాన్లు చెల్లాచెదురు కాకుండా చూడటంలోనే జపాన్ వాళ్ల తెలివి ఉంది. వాడిన వస్తువును వెంటనే దాని స్థానంలో పెట్టడం, బయటి దుమ్ము లోపలికి రాకుండా చూడటం, అవసరం లేని వాటిని వదిలించుకోవడం, రోజూ కొద్దిగా శుభ్రం చేసుకోవడం.. ఈ చిన్న సిస్టమ్ అమలు చేస్తే ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది, మీ శ్రమా తగ్గుతుంది!
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?