Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది, ముఖ్యంగా పెళ్లి, ప్రేమ వంటి విషయాల్లో హీరోయిన్ల అభిప్రాయాలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ, సౌత్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. తన 34 ఏళ్ల జీవిత ప్రయాణంలో తాను చూసిన పెళ్లిళ్ల గురించి ఐశ్వర్య చాలా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. “నేను ఇప్పటివరకూ చూసిన వైవాహిక జీవితాల్లో నిజమైన సంతోషంతో ఉన్న జంటలు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వాముల మధ్య వచ్చే విభేదాలు, ఒత్తిడి వారి కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతాయని నేను గమనించాను,” అని ఆమె పేర్కొన్నారు.
Also Read : SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత తమ వృత్తిపరమైన ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడిపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు, ఈ క్రమంలోనే పెళ్లి అనేది జీవితానికి తప్పనిసరి అనే పాత ఆలోచనా ధోరణిని ఆమె పక్కన పెట్టేశారు. పెళ్లి చేసుకోకపోతే జీవితం పరిపూర్ణం కాదు అనే మాటను ఆమె అంగీకరించడం లేదు. అయితే, ఐశ్వర్య లక్ష్మి ప్రేమకు లేదా బంధాలకు వ్యతిరేకం కాదు. “నాకు బంధాల మీద నమ్మకం ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మనసులు కలిసినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు.. ఆ బంధాన్ని కొనసాగించడానికి ‘పెళ్లి’ అనే ముద్ర అవసరం లేదని నా భావన. అందుకే నేను లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ వైపు మొగ్గు చూపుతున్నాను,” అని స్పష్టం చేశారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయం లేకుండా, తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పిన ఐశ్వర్య లక్ష్మిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్‌ను సమర్థిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!