Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veeramachineni Ramakrishna: ‘వీఆర్కే డైట్’, ‘వీరమాచినేని డైట్’ పేరిట తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన, రాయదుర్గంలోని వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ వ్యవస్థాపకుడు వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కొవ్వు, ప్రొటీన్ ఆధారిత ఆహారంతో ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన సవాల్ చేస్తుండటంతో, నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఓ న్యాయవిద్యార్థి ఆ ప్రకటనలు, వీడియోలు చూసి ఆయనను సంప్రదించారు. మధుమేహం (టైప్-1 డయాబెటిస్)తో బాధపడుతూ ఇన్సులిన్ తీసుకుంటున్న ఆ బాధితుడికి, వీరమాచినేని రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్-1 డయాబెటిస్ నయం చేస్తామని చెప్పి కొన్ని ఆరోగ్య చిట్కాలు సూచించారు.
ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడొద్దని, తమ చిట్కాలు మాత్రమే పాటించాలని తెలపడంతో పాటు అందుకుగాను రూ.26 వేలు ఫీజుగా తీసుకున్నారు. ఈ క్రమంలో వీఆర్కే చెప్పిన డైట్‌ను ఈనెల 12న ఆ న్యాయ విద్యార్థి ప్రారంభించగా, సూచనల మేరకు నడుచుకున్న కేవలం రెండు రోజుల్లోనే (ఈనెల 14న) తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు పాలుకావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం కోసం రూ.58 వేలకుపైగా బిల్లు అయింది. వీరమాచినేని రామకృష్ణ చెప్పిన ఆరోగ్య చిట్కాల వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ బాధితుడు ఈనెల 24న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు, సామాజిక మాధ్యమాల వేదికగా ‘వీఆర్కే డైట్’ పేరిట అనధికార వైద్య సలహాలు ఇస్తూ, అల్లోపతి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఇటీవల దాఖలు చేసిన కేసు విచారణ కూడా వాయిదా పడింది. ఈ కేసు విచారణను సిటీ సివిల్ కోర్టు నవంబరు 25కి వాయిదా వేస్తూ, వీరమాచినేనికి సమన్లు జారీ చేసింది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?