తెలంగాణలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై, ఆయన స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దానం నాగేందర్ ఘాటుగా ఖండిస్తూ, ఆ పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌ను కోరారు. అఫిడవిట్లో దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని స్పష్టం చేశారు.
Beat the Heat : ఏసీ లేకపోయినా మీ ఇల్లు కూల్‌గా ఉండాలా..? ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి.!
మార్చి 2024లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరైన విషయాన్ని అంగీకరించినప్పటికీ, అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో జరిగినదేనని చెప్పారు. ఒక పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవడమే ఫిరాయింపుగా పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావించడం అనుచితమని, ఆ నిర్ధారణకు చట్టపరమైన ఆధారాలు లేవని చెప్పారు. అనర్హత పిటిషన్ రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేయబడిందని వాదించిన దానం నాగేందర్, పిటిషన్లో బలం లేదని, అందువల్ల దానిని కొట్టి వేయాలని స్పీకర్ కోర్టును కోరుతూ తన అఫిడవిట్‌ను ముగించారు.
IRCTC Refund Hack: రైలు మిస్ అయినా లేదా ఆలస్యమైనా.. రూపాయి పోకుండా రీఫండ్ పొందే ట్రిక్ ఇదే.!