D.Raja: సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు. అనేక సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారన్నారు. 1980 లో కలకత్తా మహా సభ జరిగితే రాజేశ్వర్ రావు కమ్యూనిస్టుల పునరేకీకరణ ఒకే మార్గం అని చెప్పారన్నారు. 1992 హైదరాబాద్ లో జరిగిన మహాసభ లో రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు ఉండాలని సూచించారని తెలిపారు. గత సంవత్సరం విజయవాడ లో ఉద్యమ పునరేకీకరణ జరిగలని మహాసభ లో ప్రతిపాదించింది నేడు జరిగిందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలి అనేది కమ్యూనిస్టుల ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు.
Read also: IPL2023 : సన్ రైజర్స్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా ధరణి.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన దసరా టీమ్..
కమ్యునిజం అనేది అత్యంత ప్రమాదకరమైనది అని మోడీ చెబుతున్నారని తెలిపారు. మేము చెబుతున్నాం కమ్యునిజం ముఖ్యం ప్రమాదమే కానీ అది మోడీ, బీజేపీ లకు ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం గా తీసుకురావాలని వాళ్ళు కుట్ర జరుగుతుందని తెలిపారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పని చేస్తే అందుకు బీజేపీ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది అందుకు మనం ఊరుకుంటామన్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే అదానీ, మోడీ సంబంధం బయటికి వస్తుంది కనుక వేయడం లేదని తెలిపారు. రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేరుగా ఉంటాయన్నారు. కానీ తెలంగాణ,తమిళనాడు, కేరళ లో గవర్నర్ ను ఒక సాధనగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఒకే భాష, ఒకే దేశం ఒకే పార్టీగా మారాలని మోడీ చూస్తున్నాడని మండిపడ్డారు. ఈ దేశాన్ని, రాజ్యాంగన్ని కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నీ ఒడించడానే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అన్ని సెక్యులర్, ప్రోగ్రెసివ్ పార్టీలు ఒక్క తాటి మీదకు రావాలన్నారు. బీజేపీ ని ఓడించాలి.. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగుదామన్నారు.
Tammineni: ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా… గోల్కొండ కోట కింద బొంద పెడతాం