సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు.
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టుల రూటే సపరేటు. సిపిఐ , సిపిఎం మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. 2018 ఎన్నికల్లో ఆ వైరంతోనే చెరో పక్షాన్ని ఎంచుకున్నాయి. సిపిఎం… బిఎల్ఎఫ్ ప్రయోగం చేసింది. సిపిఐ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. చివరికి రెండు పక్షాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రయోగానికి తెర లేపాయి రెండు పార్టీలు. విధానపరమైన వైరం కొనసాగుతున్నా..కలిసి ఉద్యమాలు చేశాయి రెండు పక్షాలు. కానీ…